విరహం At పీక్

by Monday, November 06, 2017 0 comments

నువు వినగలిగితే
నా గుండె శబ్దాన్ని విను
అది ఏం చెప్తుందో
నీకు మాత్రమే తెలుస్తుంది

నువు చూడగలిగితే
నా అంతరాత్మలోకి తొంగి చూడు
నీ కోసం
పరితపిస్తూ కనిపిస్తుంది

నువు చదవగలిగితే
నా తలలోకి దూరిపో
నేనెంతగా ఆలోచిస్తున్నానో
తెలుస్తుంది

నువు నా నాడులలో
ఉరకలెత్తే రక్తాన్ని చూస్తే
అది నీకోసం ఎంతలా
ఎగిసి పడుతోందో తెలుస్తుంది.

నువు నా కళ్ళల్లోకి చూస్తే
వాటి వెనక నీ ప్రతిబింబమే కనిపిస్తుంది

ఇంత సంతోషానికి  కారణమైన నిన్ను
సొంతం చేసుకొనేది ఎపుడు