బసవ మార్ఘాన్ని వక్రీకరించిన లింగాయత మతనాయకులు

by Thursday, May 10, 2018 0 comments
“వేదాలను చించివేస్తాను. శాస్త్రాల సంకెళ్ళను తెంచేస్తాను. తర్కం నిగ్గుతేలుస్తాను, ఆగమాల నామరూపాల లేకుండా చేస్తాను. ఉదాత్తమైన తండ్రీ, కూడల సంగమ దేవా, నేను మదర చెన్నయ్య కుటుంబానికి చెందిన పుత్రుడును.” వీరశైవుల ఆరాధ్యదైవం బసవేశ్వరుని 883వ జయంతి నేడు. కర్ణాటకలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవ తల్లిదండ్రులు ఆచరించే వేదాలు, యజ్ఞాలు, ఉపనయనం తిరస్కరించి వీరశైవ మతాన్ని ప్రచారం చేసారు. వైదిక బ్రాహ్మణ మతాన్ని తిరస్కరించాలి అని పిలుపునిచ్చేరు. వీరశైవ మతం వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, తమ పుట్టుక ఆధారంగా ప్రత్యేక వర్గం పాటించే సదిని నిరాకరిస్తుంది. శివుడే సత్యం, నిత్యమని ప్రధానంగా ఉపదేశించారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే లింగాయత మతంగా స్థిరపడింది. బసవ దళిత యువకుడు, బ్రాహ్మణ యువతికి కులాంతర వివాహం ఏర్పాటు చేసారు . దీనికి బ్రాహ్మణులు ఆగ్రహానికి  గుర్రయ్యి  వధూవరుల తండ్రులకు  ఏనుగు కాళ్లకు కట్టి నగర వీధుల్లో ఈడ్పిస్తారు. ఈ దారుణ సంఘటన అణగారిన వర్గాలవారి పూర్తి స్థాయి తిరుగుబాటుకు దారితీసింది.
తీవ్రమైన ఘర్షణలు జరిగి బిజ్జల రాజు హత్యగావించబడతాడు. కులవ్యవస్థ కోరుకున్న బ్రాహ్మణులు, భూస్వామ్య కులాలవారు చివరికి విజయం సాధించారు. రాజ్యంలో అణగారిన వర్గాలవారి ఉద్యమాన్ని అణచివేసారు. పుస్తకాలు, ఉద్యమ వచనాలను ద్వంసం చేసి చివరి దాడిగా బ్రాహ్మణులు  కులవ్యవస్థను ప్రవేశపెట్టే ఉద్దేశ్యంతో  లింగాయత్ మతానికి మారి  అగ్రకుల లింగాయత్ అనే ఒక ఉపకులాన్ని సృష్టించారు. తమలో తాము వివాహాలు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. లింగాయత మతాన్ని తమ అదుపులో పెట్టుకున్నారు. బ్రాహ్మణులు వారి మాటాలను కైవసం చేసుకుని కులతత్వం పెంచారు ప్రస్తుతం మనువాద భావజాలం పెంచే బాజపా ఠో చేయ కలిపారు.
లింగాయత్నని చెప్పుకునే ఒక్కపటి కర్ణాటక ముఖ్యమంత్రి  యెద్దురప్ప బాజాపా కు మద్దతు నిచ్చి బ్రాహ్మణలు ఆధిపత్యంలో ఉన్న  లింగాయత మటాలికి 20 కోట్లు ఇచ్చారు. దీనిని బట్టి తెలుస్తుంది ఏమిటంటే కుల నిర్మూలన  అన్నాది అగ్రకుల నాయకత్వముతో కానీ  వారితో కలిసి కానీ  చేసుకునేది కాదు. ఎందుకంటే  ఆధిపత్య  వర్ఘాలలో అత్యధికులు తమ ఆధిపత్యం వదులుకోవడానికి ఇష్ట పడరు. అణగారిన వర్ఘాలు తమ నాయకత్వంలో తమ ఐక్యత ద్వార  అసమానతలు వ్యతిరేకంగా పోరాడటం వల్లనే   కుల నిర్మూలన సాధ్యం అవుతుంది. ఎప్పుడు అయితే ఆదిపత్య వర్ఘాలికి  రాజ్యాధికారం పోయి కులం వల్ల  లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ కనబడుతుందో అప్పుడే కులం పోతుంది.

anlogueboy

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.